కాకతీయ ఎక్స్ప్రెస్ కిందపడి తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
నల్గొండ: కాకతీయ ఎక్స్ప్రెస్ కిందపడి తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వంగపల్లి - రాయగిరి స్టేషన్ల మధ్య శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ కూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులా లేక మరేదైన కారణమా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.