బాలికను గర్భవతిని చేసిన యువకుడు | Teenager believing girl Was pregnant | Sakshi
Sakshi News home page

బాలికను గర్భవతిని చేసిన యువకుడు

Nov 1 2014 2:17 AM | Updated on Mar 28 2018 11:11 AM

బాలికను గర్భవతిని చేసిన యువకుడు - Sakshi

బాలికను గర్భవతిని చేసిన యువకుడు

బాలికను ఓ యువకుడు నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ ఘటన వికారాబాద్ మండలంలో వెలుగుచూసింది.

వికారాబాద్: బాలికను ఓ యువకుడు నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ ఘటన వికారాబాద్ మండలంలో వెలుగుచూసింది.
 పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డిగూడకు చెందిన బాలిక వికారాబాద్‌లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే మండలం పాతూర్ గ్రామానికి చెందిన చాకలి రఘుపతి కూడా వికారాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ చ దువుతున్నాడు. వీరు రోజూ ఒకే బస్సులో వచ్చేవారు.

ఈ నేపథ్యంలో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి శుక్రవారం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ తల్లీకూతుళ్లు వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలాఉండగా రఘుపతి పరారీలో ఉన్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement