కొంగను పాయసానికి పిలిచినట్టే..! | Revanth Reddy comments on kcr | Sakshi
Sakshi News home page

కొంగను పాయసానికి పిలిచినట్టే..!

Published Thu, Dec 29 2016 12:54 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

సీఎం కేసీఆర్‌ తనను భోజనానికి పిలిస్తే కొంగబావను నక్కబావ దావత్‌కు పిలిచినట్టే ఉంటుందని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్‌ తనను భోజనానికి పిలిస్తే కొంగబావను నక్కబావ దావత్‌కు పిలిచినట్టే ఉంటుందని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొంగబావ–నక్కబావ కథను ప్రస్తావిస్తూ.. ‘‘కొంగ, నక్క పరస్పరం బావా.. బావా అని పిలుచుకుంటూనే ఎవరి దారిలో అవే పనిచేస్తుంటాయి. ఓసారి కొంగను నక్క దావత్‌కు పిలుస్తుంది. ఆహ్వానం కదాని కొంగ వెళుతుంది.

అక్కడొక విశాలమైన పళ్లెంలో పాయసంతో నక్కబావ ఏర్పాట్లు చేసింది. పొడవాటి ముక్కున్న కొంగబావకు పళ్లెంలోని పాయసం ఎలా తాగాలో అర్థం కాలేదు. అయినా కొంగ పళ్లెంలో మూతి పెట్టి కొంచెం కొంచెం పీల్చేలోగానే.. నక్క ఆ పళ్లెంలోని పాయసాన్ని మొత్తం నాకేస్తుంది. నన్ను సీఎం కేసీఆర్‌ పిలిస్తే ఇట్లానే ఉంటది. ఒకవేళ అది ఆచరణలోకి వస్తే ఎట్లా ఉంటదో మీరే (మీడియా వారే) సాక్ష్యం ఉంటారుగా..’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement