ఉప్పొంగిన వాగులు : నిలిచిన రవాణా | Heavy Rains in Chennur | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన వాగులు : నిలిచిన రవాణా

Aug 13 2015 3:46 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి.

చెన్నూరు (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లాయి. దీంతో గురువారం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా మండలంలోని బుద్దారం, సంకారం, సుద్దాల నారాయణపూర్ గ్రామాల మధ్యలో ఉన్న వాగులు గురువారం కురిసిన వర్షంతో పొంగిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో ఈ గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement