త్రిష ఇల్లన్న నయనతారలో సిమ్రాన్ | Simran in Trisha Illana Nayanthara | Sakshi
Sakshi News home page

త్రిష ఇల్లన్న నయనతారలో సిమ్రాన్

Feb 24 2015 12:58 AM | Updated on Sep 2 2017 9:47 PM

త్రిష ఇల్లన్న నయనతారలో సిమ్రాన్

త్రిష ఇల్లన్న నయనతారలో సిమ్రాన్

త్రిష ఇల్లన్న నయన తార చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించనున్నారన్న ప్రచారం సాగుతోంది.

త్రిష ఇల్లన్న నయన తార చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించనున్నారన్న ప్రచారం సాగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, యువ కథనాయకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార. పెన్సిల్ చిత్రంతో కథనాయకుడుగా అవతారం ఎత్తిన జీవీ తన రెండో చిత్రం డార్లింగ్ తొలుత విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి చిత్రం పెన్సిల్ త్వరలో తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవీ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు.
 
  త్రిష ఇల్లన్న నయనతార చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో ఆయనకు జంటగా కయల్ చిత్రం ఫేం ఆనంది హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రను సీనియర్ నటి ఒక ప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ నటించనున్నారన్నది తాజా సమాచారం. సిమ్రాన్ 90వ దశకంలో దక్షిణాదిలో నంబర్ వన్ కథానాయకీగా వెలుగొందారు. ప్రముఖ హీరోలు అందరితో నటించి మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆహా కల్యాణం వంటి పలు చిత్రాల్లో నటించినా, ఎక్కువగా బుల్లి తెర కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష ఇల్లన్న నయన తార పాత్రను పోషిస్తూ, మళ్లీ సినిమాలపై దృష్టి సారించనున్నారన్నది కోలీవుడ్ భోగట్టా.  
 

Advertisement
 
Advertisement
Advertisement