రోస్బర్గ్కే పోల్ పొజిషన్ | Nico Rosberg Takes Pole at Chinese GP | Sakshi
Sakshi News home page

రోస్బర్గ్కే పోల్ పొజిషన్

Apr 16 2016 8:55 PM | Updated on Sep 3 2017 10:04 PM

ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ అదే దూకుడును చైనీస్ గ్రాండ్ ప్రిలో కూడా అదే దూకుడును కొనసాగించాడు.

షాంఘై:ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్ అదే దూకుడును చైనీస్ గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు.  శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ లో  రోస్బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.402 సెకెండ్లలో ల్యాప్ ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు.  దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును  రోస్ బర్గ్ తొలిస్థానం నుంచి ప్రారంభిస్తాడు. అయితే రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికార్డో రెండో స్థానం సాధించడం విశేషం. మరోవైపు ఫోర్స్ ఇండియాకు చెందిన సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement