ధోని, యువరాజ్లు కష్టమేనా? | Adam Gilchrist casts doubt on MS Dhoni, Yuvraj Singh's continuity till 2019 World Cup | Sakshi
Sakshi News home page

ధోని, యువరాజ్లు కష్టమేనా?

Jun 25 2017 2:59 PM | Updated on Sep 5 2017 2:27 PM

ధోని, యువరాజ్లు కష్టమేనా?

ధోని, యువరాజ్లు కష్టమేనా?

భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవల మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌ ఈ దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు. దాంతో వచ్చే రెండేళ్లలో ధోని, యువరాజ్ల పరిస్థితి ఏమిటి అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.  2019 లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో వీరి స్థానం ఎంతవరకూ అనే దానిపై చర్చ మొదలైంది. 

 

ఇదే అనుమానాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ కూడా వ్యక్తం చేశాడు. రాబోయే కాలంలో భారత జట్టును సమతుల్యంగా ఉంచాలంటే మాత్రం కఠినమైన చాలెంజ్ తప్పదని గిల్లీ అభిప్రాయపడ్డాడు. ఇదే క్రమంలో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల కెరీర్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు. వీరిద్దరూ వచ్చే రెండేళ్ల పాటు జట్టులో ఉండాలంటే కఠినంగా శ్రమించక తప్పదన్నాడు. అదే సమయంలో ఆ ఇద్దరూ వరల్డ్ కప్ వరకూ కొనసాగే విషయంపై సెలక్టర్లు, బోర్డుతో చర్చించి సరైన నిర్ణయం తీసుకో్వలన్నాడు.  ఒకవేళ వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే మాత్రం ఆ విషయాన్ని ముందుగానే బోర్డుకు తెలియజేసి హామీ తీసుకుంటేనే మంచిదన్నాడు. ఈ మేరకు క్రికెట్ బోర్డు కూడా యువరాజ్, ధోనిల భవిష్యత్తుపై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. ఈ విషయంలో వారికి తాను ఏమీ చెప్పదలుచుకోలేదని గిల్ క్రిస్ పేర్కొన్నాడు. వారిద్దరికీ ఏమీ చేయాలో అనే దానిపై పూర్తి స్పష్టత ఉందని పేర్కొన్నాడు. ఇలా ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు యువీ, ధోనిల భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించడంతో ఆ ఇద్దరు ఎప్పటివరకూ అనే ప్రశ్న మొదలైంది. మరి యువీ, ధోనిలు 2019 వరల్డ్ కప్ వరకూ ఉంటారా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement