‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’ | Vikas Khanna Paid Guru Dakshina to The Man Who Make Dibba Roti | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవుతోన్న స్టార్‌ చెఫ్‌ ట్వీట్‌

May 12 2020 5:07 PM | Updated on May 13 2020 10:11 AM

Vikas Khanna Paid Guru Dakshina to The Man Who Make Dibba Roti - Sakshi

సెలబ్రిటీ చెఫ్‌ వికాస్‌ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పాక శాస్త్ర ప్రావీణ్యంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వికాస్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ స్టార్‌ చెఫ్‌ పేదలకు తన వంతు సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వికాస్‌ చేసిన ఓ ట్వీట్‌ తెగ వైరలయ్యింది. ‘‘స్ట్రీట్‌ బైట్’‌ యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా నాకు మాస్టర్‌ చెఫ్‌ సత్యం పరిచయం అయ్యారు. ఈ చానెల్‌లో‌ వచ్చిన సత్యం గారి వీడియో చూసి నేను దిబ్బ రొట్టె చేయడం ఎలాగో నేర్చుకున్నాను. ఈ క్రమంలో నేను నా గురువు సత్యం గారికి గురుదక్షిణ సమర్పించాలనుకుంటున్నాను. దయచేసి ఆయనకు సంబంధించిన వివరాలు తెలియజేయండి అంటూ వికాస్‌ ట్వీట్‌ చేశారు.
 

కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్‌ వేలాది లైక్‌లు, షేర్‌లు సంపాదించింది. అంతేకాక 24 గంటల్లోనే సదరు సత్యం వివరాలను రీట్వీట్‌ చేశారు ట్విటర్‌ ఫాలోవర్లు. తన గురువు గారి వివరాలు తెలియజేసిందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు వికాస్‌ ఖన్నా.
 

Advertisement
 
Advertisement
Advertisement