రాజధాని ముసుగులో అక్రమాలు

Alla Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

చంద్రబాబుపై ఆర్కే ధ్వజం 

ఇవన్నీ మీడియా ప్రపంచానికి తెలియజేయాలి

మంగళగిరి: రాజధాని పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అక్రమాలను ప్రపంచానికి తెలియనీయకుండా కొన్ని మీడియా సంస్థలు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలను బయటకు తెలిసేలా మీడియా వ్యవహరించాలని హితవు పలికారు. రాజధాని పేరుతో చంద్రబాబు అతని బినామీలు, అప్పటి మంత్రులు, టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల విలువైన భూములను కొట్టేయడంతో పాటు కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడారు.

తుళ్లూరు ప్రాంతం కట్టడాలకు పనికిరాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని శివరామకృష్ణ కమిటీ తేల్చిచెప్పినా చంద్రబాబు తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ఎంపిక చేశారన్నారు. అప్పట్లోనే తాను అసెంబ్లీ సాక్షిగా మంగళగిరి ప్రాంతమైతే కట్టడాల ఖర్చు తగ్గుతుందని, అంతేగాక వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పానని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి మంగళగిరి ప్రాంతం అనువుగా ఉంటుందని, అక్కడ నిర్మాణాలు కొనసాగిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. అయినా రాజధానిని తరలిస్తున్నారని ఎవరు చెప్పారని ప్రశి్నంచారు.

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. ‘రాజధాని అమరావతి అంటూ గోబెల్స్‌ ప్రచారం నిర్వహించిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సొంతిల్లు కట్టుకున్నారా? అసలు రాజధానిలో చంద్రబాబుకు అడ్రసు ఎక్కడ ఉంది?’ అంటూ దుయ్యబట్టారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఇల్లు నిరి్మంచుకోవడంతో పాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని గుర్తు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top