సూపర్‌స్టార్స్‌తో సింగిల్ సాంగ్? | Trisha item song in Rajinikanth's Lingaa? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్స్‌తో సింగిల్ సాంగ్?

Oct 17 2014 1:08 AM | Updated on Sep 2 2017 2:57 PM

త్రిష , రజనీకాంత్‌

త్రిష , రజనీకాంత్‌

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ప్రతి హీరోయిన్ ఆశ పడుతుంది. హీరోయిన్‌గా కాకపోయినా సింగిల్‌సాంగ్‌లోనూ, సింగిల్ సన్నివేశంలో అయినా నటించే అవకాశం కోసం తహతహలాడుతారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ప్రతి హీరోయిన్ ఆశ పడుతుంది. హీరోయిన్‌గా కాకపోయినా సింగిల్‌సాంగ్‌లోనూ, సింగిల్ సన్నివేశంలో అయినా నటించే అవకాశం కోసం తహతహలాడుతారు. అలాంటి ఆకాంక్ష నటి త్రిషకు ఉంది. ఈ బ్యూటీ చిత్రరంగ ప్రవేశం చేసి దశాబ్దం దాటింది. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అయినా ఇప్పటి వరకు ఈ బ్యూటీకి సూపర్‌స్టార్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని ఈ బ్యూటీ చాలాసార్లు చెప్పుకుని చింతించారు కూడా.

అయితే ప్రతి నటికి ఒక అవకాశం వస్తుందన్నట్లు ఈ అమ్మడికి ఇప్పుడలాంటి చాన్స్ వచ్చిందని సమాచారం. అయితే అది హీరోయిన్ చాన్స్ కాదు ఒక్క పాటలో రజనీతో ఆడే అవకాశం వచ్చినట్లు తెలిసింది. సూపర్‌స్టార్ ప్రస్తుతం లింగా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది.

ప్రస్తుతం రజనీకాంత్ ఈ చిత్రం కోసం సోనాక్షి సిన్హా, అనుష్కలతో డ్యూయెట్లు పాడుకుంటున్నారు. ఈ చిత్రంలో నటి త్రిష ఒక సింగిల్ సాంగ్‌కు చిందేయనున్నట్లు తెలిసింది. లింగా చిత్రంలో ఈ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందట. ఈ పాటలో రజనీతోపాటు త్రిష నటించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే మొత్తం మీద సూపర్‌స్టార్‌తో సింగిల్ సాంగ్‌తోనైనా నటించే అవకాశాన్ని త్రిష దక్కించుకున్నారన్నమాట.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement