రాజ్యసభకు మన్మోహన్‌ సింగ్‌ ఏకగ్రీవం

Manmohan Singh Elected Unopposed To Rajya Sabha From Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్తాన్‌ బీజేపీ చీఫ్‌ మదన్‌ లాల్‌ సైనీ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండటంతో ఇతర పార్టీలు అభ్యర్థుల్ని పోటీకి దింపలేదు. ఇక నామినేషన్‌ ఉపసంహరణ తేదీ సోమవారం ముగియడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది. మన్మోహన్‌ సింగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజస్తాన్‌ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌ మన్మోహన్‌కు అభినందనలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top