లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి! | Enough evidence to proceed against Teri Pachauri: Delhi court | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి!

May 14 2016 1:45 PM | Updated on Sep 4 2017 12:06 AM

లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి!

లైంగికంగా వేధించినట్టు ఆధారాలున్నాయి!

సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరికి ఎదురుదెబ్బ తగిలింది.

న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్కే పచౌరికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై పోలీసులు నమోదుచేసిన చార్జ్‌షీట్‌ను ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకుసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. పచౌరిపై చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ శివానీ చౌహాన్‌ ఈ కేసు విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు.

ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై పచౌరి దాడి చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతో ఆమెను వెంటాడాడని, ఆమె పరువుకు భంగం కలింగించేలా వ్యవహరించాడని ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు. 2015లో బాధితురాలిని లైంగికంగా వేధించినట్టు పచౌరి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement