దుష్ర్పచారం తగదు : నిర్మాత కృష్ణారెడ్డి | Vinavayya Ramayya Success Meet | Sakshi
Sakshi News home page

దుష్ర్పచారం తగదు : నిర్మాత కృష్ణారెడ్డి

Jun 22 2015 12:34 AM | Updated on Sep 3 2017 4:08 AM

దుష్ర్పచారం తగదు : నిర్మాత కృష్ణారెడ్డి

దుష్ర్పచారం తగదు : నిర్మాత కృష్ణారెడ్డి

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీవీ వినాయక్‌గారు కూడా ఫోన్ చేసి అభినందించారు. కొంతమంది ఈ సినిమా చూసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్

‘‘ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీవీ వినాయక్‌గారు కూడా ఫోన్ చేసి అభినందించారు. కొంతమంది ఈ సినిమా చూసి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెంటినీ సమీక్షల్లో ప్రస్తావించారు. కొంతమంది పనిగట్టుకుని మరీ దుష్ర్పచారం చేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకులు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాపై ఇలాంటి ప్రచారాలు తగదు’’ అని నిర్మాత కృష్ణారెడ్డి అన్నారు. జి. రామ్‌ప్రసాద్ దర్శక త్వంలో తన తనయుడు నాగ అన్వేష్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ఆయన నిర్మించిన చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అన్నారు. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కామెడీ, ద్వితీయార్ధంలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా పండాయని నాగ అన్వేష్ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement