ప్రభాస్కు హీరోయిన్, విలన్ ఫిక్స్ | Villain, Heroine Fixed for Prabhas Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్కు హీరోయిన్, విలన్ ఫిక్స్

Jun 23 2016 11:48 AM | Updated on Sep 4 2017 3:13 AM

ప్రభాస్కు హీరోయిన్, విలన్ ఫిక్స్

ప్రభాస్కు హీరోయిన్, విలన్ ఫిక్స్

ప్రస్తుతం బాహుబలి పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా పూర్తవ్వగానే ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం...

ప్రస్తుతం బాహుబలి పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా పూర్తి కాగానే ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ హోం ప్రొడక్షన్స్ యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇప్పటికే కథాకథనాలు రెడీ అయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. తొలిసారిగా ప్రభాస్ సరసన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతినాయక పాత్రకు బాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్ను ఎంపిక చేశారు. విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయం అయిన నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాలో విలన్గా నటించనున్నాడు. సుజిత్ గత సినిమా తరహాలోనే ప్రభాస్ సినిమా కూడా థ్రిల్లర్ జానర్లో రూపొందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement