హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం! | Today Nagachaitanya Birthday | Sakshi
Sakshi News home page

హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం!

Nov 22 2015 11:28 PM | Updated on Sep 3 2017 12:51 PM

హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం!

హీరోగా.. నిర్మాతగా... అదే నా లక్ష్యం!

‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావె’ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కనబరుస్తున్న ఆదరాభిమా నాలకు ఆనందంగా ఉంది.

‘‘నా మొదటి సినిమా ‘ఏ మాయ చేశావె’ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కనబరుస్తున్న ఆదరాభిమా నాలకు ఆనందంగా ఉంది. ఓ హీరోగా వారిని మెప్పించేలా వైవిధ్యమైన చిత్రాలు చేయాలన్నది నా లక్ష్యం. ఇప్పటివరకూ చేసినవాటిలో ‘మనం’ నాకు ప్రత్యేకం. తాతగారు, నాన్నతో కలిసి నటించిన ఆ చిత్రం తీపి గుర్తుగా నిలిచిపోతుంది’’ అని నాగచైతన్య అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. భవిష్యత్ ప్రణాళికల గురించి నాగచైతన్య చెబుతూ- ‘‘నాకు మొదట్నుంచీ నిర్మాణ రంగంపై ఆసక్తి ఉంది.

మా అన్నపూర్ణ స్టూడియో బేనర్లో రూపొందిన ‘ఒక లైలా కోసం’ సినిమా నిర్మాణ బాధ్యతలు చూసుకున్నాను. ఓ నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ పూర్తయ్యిందనీ, రోడ్ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇదని చెప్పారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ’ నచ్చడంతో తనతో ఓ సినిమా చేయాల నుకున్నాననీ, కథ కూడా అనుకున్న నేపథ్యంలో మలయాళ ‘ప్రేమమ్’ నచ్చడంతో ఆ సినిమా రీమేక్ చేద్దామని చందూతో చెప్పానని నాగచైతన్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement