వాల్మీకి కోసం కోలీవుడ్ హీరో..! | Tamil Hero Atharvaa in Varun Tej Valmiki | Sakshi
Sakshi News home page

వాల్మీకి కోసం కోలీవుడ్ హీరో..!

Feb 17 2019 12:49 PM | Updated on Feb 17 2019 12:49 PM

Tamil Hero Atharvaa in Varun Tej Valmiki - Sakshi

విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో వరుణ్ తేజ్‌. ఇటీవల అంతరిక్షం సినిమాతో ఆకట్టుకున్న వరుణ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తమిళ సూపర్‌ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న వాల్మీకిలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్‌ నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో మరో కీలక పాత్రకు తమిళ నటుడ్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ పాత్రకు నాగశౌర్య, శ్రీ విష్ణులలో ఒకర్ని హీరోగా తీసుకోనున్నట్టుగా ప్రచారం‍ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు తమిళ హీరో అధర్వను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా అధర్వ ఈ వాల్మీకి తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం కాయంగా కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement