వివాదాస్పదమైన పాత్రలో... | Tabu Roped In For Vishal Bhardwaj's 'HAIDER'? | Sakshi
Sakshi News home page

వివాదాస్పదమైన పాత్రలో...

Jun 10 2014 11:30 PM | Updated on Sep 2 2017 8:35 AM

వివాదాస్పదమైన పాత్రలో...

వివాదాస్పదమైన పాత్రలో...

నటనను అమితంగా ఆరాధించే నటి టబు. కెరీర్‌కి ఇబ్బంది అనుకున్నారో ఏమో... 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసు ఎత్తరామె. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు.

 నటనను అమితంగా ఆరాధించే నటి టబు. కెరీర్‌కి ఇబ్బంది అనుకున్నారో ఏమో... 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసు ఎత్తరామె. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలే ఓ వివాదాస్పదమైన పాత్రకు పచ్చజెండా ఊపారు టబు. సినిమా పేరు ‘హైదర్’. విశాల్ భరద్వాజ్ దర్శకుడు. షాహిద్ కపూర్ కథానాయకుడు. కథ రీత్యా ఇందులో షాహిద్ తల్లి పాత్ర చనిపోతుంది. దాంతో అతని తండ్రి టబుని రెండో వివాహం చేసుకుంటాడు.
 
  అలా షాహిద్ పిన్నిగా ఇంట్లోకి అడుగుపెట్టిన టబు.. కొడుకు వరుసయ్యే షాహిద్‌పై మనసు పారేసుకుంటుంది. ఈ పాత్ర తీరు తెన్నులు విశాల్ చెప్పగానే... మరో ఆలోచన లేకుండా అంగీకారం తెలిపారట టబు. ‘‘ఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం అవసరం. అందుకే సవాలుగా తీసుకొని ఈ పాత్ర చేస్తున్నా. ఇందులో గ్లామర్‌గా కనిపిస్తా. అదే సమయంలో అభినయానికి అద్భుతమైన అవకాశం ఉన్న పాత్ర. తప్పకుండా నా కెరీర్‌లో గుర్తుండి పోయే సినిమా అవుతుంది’’ అని చెప్పారు టబు. అయితే... టబు ఈ పాత్రకు ‘ఓకే’ చెప్పగానే... పలు విమర్శలు కూడా ఆమెను చుట్టుముట్టడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement