వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

Sri Reddy Facebook Post Goes Viral - Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో టాలీవుడ్‌ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. ఓ వ్యక్తి కాలిపై తన కాలును పెట్టి ఉన్న పిక్‌ను పోస్ట్‌చేసింది. అయితే తాను చేసే ప్రతీ పోస్ట్‌కు ఏదో ఒక క్యాప్షన్‌ ఇచ్చే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం ఫోటోను మాత్రమే షేర్‌ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్‌కు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతనెవరు? అంటూ ప్రశ్నించసాగారు. అతను ప్రేమికుడా? అంటూ అడిగిన నెటిజన్లకు.. స్నేహితుడంటూ సమాధానమిచ్చింది. 

పవన్‌ కళ్యాణ్‌పై సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్‌ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్‌ చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top