భవిష్యత్‌ సూపర్‌స్టార్‌ తనే!!

Soundarya Rajinikanth Shares Adorable Pic Of Son Pose From Petta - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిన్న కుమార్తె సౌందర్య ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అచ్చం రజనీకాంత్‌లాగే పోజ్‌ పెట్టి నిల్చున్న ఆమె కుమారుడు వేద్‌ ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కానీ ఆ ఫొటోకు సౌందర్య ఇచ్చిన క్యాప్షన్‌ మాత్రం మార్చాలని సూచిస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. పేట సినిమాలోని రజనీ స్టైల్‌ను అనుకరిస్తూ నిల్చున్న వేద్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన సౌందర్య... ‘ తాతలాగే మనుమడు!!!’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ఈ క్రమంలో.. ‘ప్లీజ్‌ మేడమ్‌ రజనీ సార్‌ను తాత అనకండి. తలైవా ఎప్పుడూ నిత్య యవ్వనుడిలాగానే కనిపిస్తారు. అయితే ఒక విషయం వేద్‌ కూడా ఆయనలాగే సూపర్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో రజనీ స్థాయికి ఎదుగుతాడు. ఇందులో సందేహం లేదు’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా రజనీ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా దర్బార్‌ సెట్లోనూ వేద్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక కొచ్చాడియాన్‌ మూవీతో డైరెక్టర్‌గా మారిన సౌందర్యా రజనీకాంత్‌ ఇటీవలె వ్యాపారవేత్త విశాగన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. కాగా 2010లో వ్యాపారవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌందర్యకు ఆయన ద్వారా వేద్‌ కృష్ణ అనే కుమారుడు కలిగాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top