యూట్యూబ్లో మహేష్ కూతురి డాన్స్ హల్చల్ | Sakshi
Sakshi News home page

యూట్యూబ్లో మహేష్ కూతురి డాన్స్ హల్చల్

Published Tue, Sep 23 2014 12:25 PM

యూట్యూబ్లో మహేష్ కూతురి డాన్స్ హల్చల్

మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. చాలా క్యూట్గా ఉండే ఆయన కూతురు సితార.. ఆగడు చిత్రంలోని 'తూ ఆజా సరోజా' పాటకు డాన్స్ చేసింది. పూర్తిస్థాయిలో డాన్స్ కాకపోయినా.. చేతులు ఊపుతూ తనకు చేతనైనట్లుగా ఆమె డాన్స్ చేసింది. ఇంతకుముందు నాన్న ఎత్తుకుని ఉంటే ఆయన ముక్కు మీద తన బుల్లి వేలు ఉంచిన సితార ఫొటో సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యింది.

ఇప్పుడు పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుని, చేతులకు గ్లోవ్స్ వేసుకుని ఆమె డాన్సు చేస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లంతా సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆమెను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ఉంది. 'ఆగడు' చిత్రానికి సంబంధించిన వాళ్లే ఈ వీడియోను తీసి యూట్యూబ్ లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు.

Advertisement
Advertisement