దిల్‌ ఉంటే గుంపుగా రండి రా! | Rajinikanth’s ‘Kaala’ teaser released | Sakshi
Sakshi News home page

దిల్‌ ఉంటే గుంపుగా రండి రా!

Mar 3 2018 12:37 AM | Updated on Sep 12 2019 10:40 AM

Rajinikanth’s ‘Kaala’ teaser released - Sakshi

రజనీకాంత్‌

ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు... దాదాపు 20 ఏళ్ల క్రితం ‘బాషా’లో రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. ఆ తర్వాత ఇలాంటి పంచ్‌ డైలాగులు బోలెడన్ని చెప్పారు. వాటిలో ‘శివాజీ’లో చెప్పిన ‘నాన్నా.. సింహం సింగిల్‌గా వస్తుంది. పందులే గుంపుగా వస్తాయి’ అనే డైలాగ్‌ ఒకటి. ఇప్పుడు రజనీ ‘గుంపుగా రండి రా’ అంటున్నారు. ఇలా పిలుస్తున్నది ‘కాలా’ గెటప్‌లో. ‘కబాలి’ ఫేమ్‌ రంజిత్‌. పా దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై దర్శక–నటుడు, రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మించిన చిత్రం ‘కాలా’.

తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ కానున్న ‘కాలా’ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘కాలా అంటే.. ఎవరు? కాలుడు. కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు...’, ‘క్యారె.. సెట్టింగా? వీరయ్య బిడ్డను రా ఒక్కడినే ఉన్నా.. దిల్‌ ఉంటే గుంపుగా రండిరా!’ అని టీజర్‌లో రజనీకాంత్‌ పలికిన డైలాగ్స్‌ అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు అభిమానులు. ‘కాలా’ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్‌ నెక్ట్స్‌ చిత్రం ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరు«ద్‌ను సంగీతదర్శకునిగా తీసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement