మూడు సినిమాలతో బిజీ | rajasekhar busy with three films | Sakshi
Sakshi News home page

మూడు సినిమాలతో బిజీ

May 2 2014 10:36 PM | Updated on Sep 2 2017 6:50 AM

మూడు  సినిమాలతో బిజీ

మూడు సినిమాలతో బిజీ

రాజశేఖర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘పట్టపగలు’లో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వమ్’కు రీమేక్‌గా ‘గడ్డం గ్యాంగ్’ చేస్తున్నారు.

రాజశేఖర్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘పట్టపగలు’లో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వమ్’కు రీమేక్‌గా ‘గడ్డం గ్యాంగ్’ చేస్తున్నారు. అలాగే జీవిత దర్శకత్వంలో ‘వందకు వంద’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాల గురించి రాజశేఖర్ వివరిస్తూ- ‘‘ఓ హోటల్‌కి లంచ్‌కి వెళ్ళినపుడు అనుకోకుండా రామ్‌గోపాల్‌వర్మ కనిపించారు. అప్పుడే ‘పట్టపగలు’ సినిమా ప్రతిపాదన వచ్చింది. ఓ వైపు భయపడుతూనే, మరోవైపు సెంటిమెంట్‌తో సాగే పాత్ర నాది. జూన్ 6 న ఈ సినిమా విడులవుతుంది. ‘వందకు వంద’ లో మా పెద్దమ్మాయి శివాని కీలకపాత్ర చేస్తోంది. ఇప్పటికి 70 శాతం షూటింగ్ పూర్తయింది. సంతోష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘గడ్డం గ్యాంగ్’ లో నా పాత్ర పేరు గడ్డం దాస్. అంజలి లావానియా నాయికగా చేస్తున్నారు. ఈ సినిమా చాలా బావుంటుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement