ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది..! | Raj tarun Shelved Film to be revived soon | Sakshi
Sakshi News home page

ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది..!

Apr 20 2017 3:10 PM | Updated on Sep 5 2017 9:16 AM

ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది..!

ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది..!

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్, కొద్ది రోజులు కిందట ఆగిపోయిన ఓ సినిమాను తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్, కొద్ది రోజులు కిందట ఆగిపోయిన ఓ సినిమాను తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు. మారుతి అందించిన కథతో లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజుగాడు సినిమాను ప్రారంభించాడు రాజ్ తరుణ్. అయితే అప్పటికే ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది.

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అంధగాడు షూటింగ్ పూర్తి కావస్తుండటంతో రాజ్ తరుణ్ కు కాస్త ఫ్రీ టైం దొరికింది. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాతో పాటు సంజనా రెడ్డి  సినిమాకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. త్వరలోనే సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement