దక్షిణాదిలో చేదు అనుభవాలు | Radhika apte controversial comments | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో చేదు అనుభవాలు

Feb 5 2017 2:13 AM | Updated on Sep 5 2017 2:54 AM

దక్షిణాదిలో చేదు అనుభవాలు

దక్షిణాదిలో చేదు అనుభవాలు

సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాజా నటి రాధికాఆప్తే అని పేర్కొనవచ్చు.

సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన తాజా నటి రాధికాఆప్తే అని పేర్కొనవచ్చు. బాలీవుడ్‌లో అర్ధనగ్నం దాటి నగ్నంగానూ నటించి పెద్ద సంచలనానికి దారి తీసిన ఈ ఉత్తరాది నటి ఆ మధ్య ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి రమ్మన్నాడని చెప్పి పెద్ద దుమారాన్నే రేపారు. ఇలా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే తాజాగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించి మరోసారి తన వాటం ప్రదర్శించారు. ఇంతకీ ఈ అమ్మడేమందో చూద్దాం. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నేను చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఈ భాషల్లో తాను ఎక్కువ చిత్రాలు చేయలేదు. అందువల్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం గురించి నేను మాట్లాడను.

నేను నటించిన చిత్రాల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మాత్రమే చెబుతాను. తమిళం, తెలుగు చిత్రాల ఔట్‌ డోర్‌ షూటింగ్‌ల సమయంలో హీరోయిన్ల కంటే హీరోలకే హోటళ్లలో బసకు మంచి వసతులను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా హీరోలను షూటింగ్‌కు తొమ్మిది గంటలకు వస్తే చాలు అంటారు. ఇక హీరోయిన్లను అంతకు రెండు గంటలు ముందే రావాలని ఆర్డర్‌ వేస్తారు. ఇలా చాలా విషయాలు నన్ను బాధించాయి. అయితే కబాలి చిత్రానికి ఆ చిత్ర హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్‌ నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఇతర చిత్రాల్లో ఆ పరిస్థితి లేదు అని రాధికాఆప్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement