50 కాదు 90 టోటల్‌ 300!

Prabhas Saaho Movie Budget Reached 300 Crores - Sakshi

అవును 50 కోట్లు కాదు.. 90 కోట్లు. దుబాయ్‌లో జరుగుతున్న ‘సాహో’ సినిమా యాక్షన్‌ ఎపిసోడ్‌ ఖర్చు అక్షరాలా 90 కోట్లు. రోజు రోజుకు ఆడియన్స్‌లో డబుల్‌ అవుతున్న అంచనాలతో ‘సాహో’ టీమ్‌ కూడా ఖర్చు డబుల్‌ చేసింది. దుబాయ్‌లో తీస్తున్న భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌కు 50 కోట్లు అవుతుందని ముందు సమాచారం అందింది. అయితే 90 కోట్లు అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే సినిమా బడ్జెట్‌ కూడా 300 కోట్లు అని తెలిపారు.

యాక్షన్‌ పరంగా ఈ సినిమా హాలీవుడ్‌ సినిమాలకు ఏ మాత్రం తక్కువ కాకూడదని బడ్జెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కావట్లేదట చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్‌. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌: గోస్ట్‌ ప్రోటోకాల్, ట్రాన్స్‌ఫార్మర్స్‌: డార్క్‌ మూన్‌’ వంటి  హాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేసిన కెన్నీ బేట్స్‌ ఈ సినిమాకి యాక్షన్‌ సీన్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌ జిందా హై’ తర్వాత ఎక్కువ శాతం అబుదబీలో షూటింగ్‌ జరుపుకుంటున్న చిత్రం ‘సాహో’ కావడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top