‘సాహో’ దుబాయ్‌ షెడ్యూల్‌ అప్‌డేట్‌ | Prabhas Saaho Dubai Schedule Extends | Sakshi
Sakshi News home page

May 15 2018 11:59 AM | Updated on May 15 2018 1:51 PM

Prabhas Saaho Dubai Schedule Extends - Sakshi

‘సాహో’ షూటింగ్‌లో ప్రభాస్‌

బాహుబలి లాంటి ఘనవిజయం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. రన్‌ రాజా రన్‌ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు భారీ చేజ్‌లను చిత్రీకరిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సాహో యూనిట్‌ దుబాయ్‌ షెడ్యూల్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. విరామం లేకుండా రిస్కీ యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్న కారణంగా ప్రభాస్‌ చాలా ప్రెజర్‌ ఫీల్‌ అవుతున్నాడట.. అందుకే షెడ్యూల్‌ ను పొడిగించి షూటింగ్‌ కాస్త నెమ్మదిగా చేయాలని నిర్ణయిం‍చినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement