ఇది పోలీసోడి పవర్! | Powerful Police Vijay | Sakshi
Sakshi News home page

ఇది పోలీసోడి పవర్!

Apr 2 2016 10:39 PM | Updated on Apr 3 2019 8:57 PM

ఇది పోలీసోడి పవర్! - Sakshi

ఇది పోలీసోడి పవర్!

అతను పవర్‌ఫుల్ పోలీస్... బెత్తంతో క్రిమినల్స్‌ను చిత్తక్కొడుతుంటాడు. టీచర్‌లా బెత్తంతో కొట్టడం ఏంటి?

 అతను పవర్‌ఫుల్ పోలీస్... బెత్తంతో క్రిమినల్స్‌ను చిత్తక్కొడుతుంటాడు. టీచర్‌లా బెత్తంతో కొట్టడం ఏంటి? లాఠీ ఏమైంది అనుకుంటున్నారా? మరదే వెరైటీ. మాస్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘తెరి’ట్రైలర్‌లోనే ఆయన అలా బెత్తంతో కొడుతూ, కనిపిస్తారు. తమాషా ఏంటంటే... ఇతగాడు ఇరగదీస్తుంటే, అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి వేరే చోట కూతురితో హ్యాపీగా జీవిస్తుంటాడు. అంటే... ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అది ప్రస్తుతానికి సస్పెన్స్.
 
 విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్  నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ‘పోలీసోడు’ పేరుతో ‘దిల్’ రాజు, కలైపులి థాను ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: జార్జ్ సి. విలియమ్స్, సహ- నిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.
 

Advertisement
 
Advertisement
Advertisement