నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్ | peoples are talking about my comedy ,says sharwanand | Sakshi
Sakshi News home page

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

Aug 16 2014 12:30 AM | Updated on Sep 2 2017 11:55 AM

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

నా కామెడీ బావుందంటున్నారు - శర్వానంద్

‘‘నా పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు.

‘‘నా పదేళ్ల కల ఈ విజయం. నా కెరీర్‌కి ఇంతటి విజయాన్నిచ్చిన యు.వి. క్రియేషన్స్ సంస్థకు కృతజ్ఞతలు. ఈ సినిమా చూసిన వారందరూ నేను కామెడీ బాగా చేశానంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు సుజిత్‌కే దక్కుతుంది’’ అని శర్వానంద్ అన్నారు. ఆయన కథానాయకునిగా సుజిత్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ కలిసి నిర్మించిన ‘రన్ రాజా రన్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు సుజిత్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సమష్టి విజయమనీ నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దిల్ రాజు, అడివి శేషు కూడా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement