పిన్నిని అయ్యాను.. ఇక శాశ్వతంగా ఇక్కడే! | Parineeti Chopra Shares Adorable Pic With Sania Mirza Son | Sakshi
Sakshi News home page

పిన్నిని అయ్యాను.. ఇక శాశ్వతంగా ఇక్కడే!

Apr 2 2019 10:48 AM | Updated on Apr 2 2019 10:50 AM

Parineeti Chopra Shares Adorable Pic With Sania Mirza Son - Sakshi

ఇంకో టెర్రరిస్టు పుట్టాడు. భవిష్యత్తులో ఇలాంటి వారి వల్ల..

‘ నేనిప్పుడు పిన్నినయ్యాను!!! ఇజ్జూను చూస్తుంటే తినేయాలని అన్పిస్తుంది. కానీ ప్రస్తుతానికి నా చేతిని తినేందుకు తనకు అనుమతినిచ్చాను. సానియా నీ కుమారుడిని శాశ్వతంగా నా దగ్గరే పెట్టుకోనా’ అంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా.. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తనయుడితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పరిణీతి ఒళ్లో కూర్చుని ఆమె చేతిని ఆత్మీయంగా తాకుతున్న ఇజహాన్‌ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. ‘మీరిద్దరు చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చిన నెటిజన్లు 5 లక్షలకు పైగా లైకులు కొట్టారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంకో టెర్రరిస్టు పుట్టాడు. భవిష్యత్తులో ఇలాంటి వారి వల్ల దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి’ అని విషం చిమ్మారు.

కాగా గతేడాది అక్టోబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ అతడికి ఇజహాన్‌ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడికి సంబంధించిన ఫొటోలను సానియా తరచుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement