ప్రముఖ సినీ నేపథ్య గాయని పి. సుశీల కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో కొత్త రత్నం వచ్చి చేరింది. ఇప్పటికి ఆరు దశాబ్దాల పైగా దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురా లైన ఈ గానకోకిల పేరు తాజాగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’కు ఎక్కారు. ‘‘2016 జనవరి 28 నాటికి ధ్రువీ కరించిన సమాచారం ప్రకారం పులపాక సుశీలా మోహన్ (జననం 1935 - ఇండియా) 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలు రికార్డ్ చేశారు’’ అని గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు.
1952లో తమిళ చిత్రం ‘పెట్రతాయి’ (తెలుగులో ‘కన్నతల్లి’) ద్వారా సినీ సీమకు గాయనిగా పరిచయమైన ఆమె ఇప్పటి దాకా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 40 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అంతటి ఈ ‘గాన సరస్వతి’కి భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవిం చాయి.
‘ఝుమ్మంది నాదం...’ (చిత్రం ‘సిరిసిరి మువ్వ’), ‘ప్రియే చారుశీలే...’ (చిత్రం ‘మేఘ సందేశం’) సహా వివిధ గీతాలు పాడినందుకు గాను ఇప్పటికి 5సార్లు ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఆమెను జాతీయ అవార్డులు వరించాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషాసీమల రాష్ట్రప్రభుత్వ సినీ అవార్డులు వెతు క్కుంటూ వచ్చాయి. కొంత కాలంగా సినీ నేపథ్య గానానికి దూరంగా ఉన్న ఆమె ఎనిమి దేళ్ళుగా ‘పి. సుశీల ట్రస్ట్’ ద్వారా అవసరంలో ఉన్న సంగీత కళా కారుల్ని ఆదుకుంటూ వస్తున్నారు.
నాకు పలు జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు వచ్చాయి. కానీ, ఇప్పుడిలా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కడం మాత్రం వినూత్నమైన అనుభూతి. ఇది గ్రేటే. ఎందుకంటారా? ఈ అరుదైన ఘనత అందరికీ దక్కదు కదా! పైగా, ఏవేవో సిఫార్సులు, పైరవీలు చేస్తే ఇది వచ్చేది కూడా కాదు. నిజానికివాళ ఉదయమే శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చా. ఇంటికి వచ్చేసరికి పోస్ట్‌లో గిన్నీస్‌బుక్ వారి నుంచి ఈ సర్టిఫికెట్ వచ్చి ఉంది. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. అందుకే, ఈ విషయాన్ని సంగీతప్రియులతో, నా అభిమానులతో పంచుకోవాలనుకున్నా. నిజానికి, ఈ ఘనత నాది కాదు. నన్ను ఆదరించిన సినీ పరిశ్రమది.
నన్ను అభిమానించిన ప్రేక్షకులది. అమెరికా, చెన్నై, బెంగళూరుల్లో ఉన్న నా వీరాభిమానులు ఏడుగురు నా పేరు మీద వెబ్‌సైట్ పెట్టి, నేను పాడిన పాటలన్నీ సేకరించి, అందులో అప్‌లోడ్ చేశారు. ఆ ఏడుగురిలో ఇద్దరు మహిళాఫ్యాన్స్. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) ఎన్నేసి పాటలు పాడానో, డేటా అంతా వాళ్ళు సేకరించారు. గిన్నీస్ వాళ్లు 1960 నుంచి పాటలు తీసుకున్నారు.
కానీ, 1951 నుంచే పాటలు పాడాను. అవీ కలిపితే, పాతికవేలు దాటేస్తాయి. ఇక, ప్రైవేట్ భక్తిగీతాలు కొన్ని వేలున్నాయి. కొద్ది నెలల క్రితమే ‘బొమ్మల రామారాం’ అనే సిన్మాలో పాడాను. ఇప్పటికీ దర్శక, నిర్మాతలు పాడించాలనుకుంటే నేను రెడీ. (నవ్వుతూ) ఐనా, కొత్త సింగర్స్‌కీ ఛాన్స్ ఇవ్వాలి కదా!
- ‘సాక్షి’తో ‘పద్మభూషణ్’ పి. సుశీల
గిన్నీస్‌లో గాన కోకిల
Published Tue, Mar 29 2016 11:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్‌లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు
హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు
జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా
ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement