నేనైతే తిరిగి కొడతా: హీరోయిన్‌ | I will throw the coconut right back at them, says Amy Jackson | Sakshi
Sakshi News home page

నేనైతే తిరిగి కొడతా: హీరోయిన్‌

Aug 1 2017 6:08 PM | Updated on Sep 17 2017 5:03 PM

నేనైతే తిరిగి కొడతా: హీరోయిన్‌

నేనైతే తిరిగి కొడతా: హీరోయిన్‌

అదే నేనైతే తిరిగి కొడతా... అంటోంది నటి అమీజాక్సన్‌.

చెన్నై: అదే నేనైతే తిరిగి కొడతా... అంటోంది నటి అమీజాక్సన్‌. ఈ ఇంగ్లిష్‌ భామకిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లలో అవకాశాలు లేవు. సూపర్‌స్టార్‌తో నటించిన 2.0 చిత్రంలో మరో పాట చిత్రీకరించాల్సి ఉంది. ఇకపోతే ఒక ఇంగ్లిష్‌ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో 2.0 చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అమీ అవకాశాల కోసం ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది.

ఆ మధ్య నటి తాప్సీ దక్షిణాదిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లో మకాం పెట్టి దక్షిణాది సినిమా వారిపై ఆరోపణల దాడి మొదలెట్టింది. దక్షిణాది చిత్రాలలో చిత్రవధకు గురయ్యాననీ, ఒక దర్శకుడు పాటల సన్నివేశాల్లో బొడ్డుపై కొబ్బరి చిప్పలు వేశారనీ, ఆయనకు అదేం ఆనందమో అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆమెకు టాలీవుడ్‌లో అవకాశం కల్పించిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావునే తాప్సీ అలా ఎగతాళి చేసింది. ఆ తరువాత క్షమాపణ చెప్పిందనుకోండి. తాప్సీకి మద్దతుగా నిలిచిన నటి అమీ జాక్సన్‌ అలాంటి సంఘటనలు నిజంగా దారుణం అని పేర్కొంది.

అలా తనపై ఎవరైనా చేస్తే అదే కొబ్బరి చిప్పను వారిపై విసురుతానని అంది. ఆ విషయం వారికి బాగా తెలుసనీ, అందుకే అలాంటివి తనకు జరగలేదనీ తెలిపింది. అదృష్టవశాత్తు తానిప్పటివరకూ మంచి దర్శకుల చిత్రాలలోనే నటించానని పేర్కొంది. అదే విధంగా అందరు హీరోయిన్లకు అలా జరగదనీ, దయచేసి అలాంటి బాధాకరమైన చర్యలకు పాల్పడరాదనీ అమీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తాప్సీకి ఎదురైన అనుభవమే మొదటి సినిమాలో తనకు ఎదురైందని ఇలియానా వాపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement