కాలాలో వేశ్యగా హూమాఖురేషి! | He is acting as a prostitute in the movie Hummakurishi Kala. | Sakshi
Sakshi News home page

కాలాలో వేశ్యగా హూమాఖురేషి!

Jul 20 2017 3:45 AM | Updated on Sep 5 2017 4:24 PM

కాలాలో వేశ్యగా హూమాఖురేషి!

కాలాలో వేశ్యగా హూమాఖురేషి!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా.

తమిళసినిమా:  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా. పలు విశేషాలతో కూడిన ఈ చిత్ర రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. కబాలి వంటి సెన్సేషనల్‌ చిత్రం తరువాత రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్‌ల కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న చిత్రం కాలా.

భాషా తరువాత అంతటి పవర్‌ఫుల్‌ పాత్రలో డాన్‌గా రజనీకాంత్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నామంటున్నారు చిత్ర వర్గాలు. రజనీకాంత్‌ అల్లుడు, నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నాయకిగా బాలీవుడ్‌ బ్యూటీ హూమాఖురేషి నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే ఇందులో హూమాఖురేషి నటిస్తున్న మాట నిజమే అయినా, రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్నది మాత్రం నటి ఈశ్వరీరావు అట. మరి హూమాఖురేషి పాత్ర ఏమిటనేగా మీ ఆసక్తి. ఇందులో తను ఒక వేశ్యగా నటిస్తున్నారట.

అయినా ఈ అమ్మడి పాత్ర చాలా బలమైందిగా ఉంటుందట. ప్రస్తుతం కాలా చిత్ర షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇందు కోసం ముంబయిలోని ధారవి ప్రాంతాన్ని మరపించేలా బ్రహ్మాండమైన సెట్‌ను వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో కబాలి చిత్రంలో కంటే రాజకీయం అధికంగా ఉంటుందట. కాలాలోని రాజకీయపరమైన సంభాషణలు పెద్ద చర్చకు దారి తీస్తాయంటున్నారు. అలాంటి సంభాషణలను రజనీకాంత్‌ కోరి మరీ రాయించుకున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఏదేమైనా కాలా చిత్రంపై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయన్నది నిజం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement