నన్నెవరూ అరెస్ట్ చేయలేదు... | Did not arrest me ... | Sakshi
Sakshi News home page

నన్నెవరూ అరెస్ట్ చేయలేదు...

May 9 2014 11:50 PM | Updated on Apr 3 2019 6:23 PM

నన్నెవరూ అరెస్ట్ చేయలేదు... - Sakshi

నన్నెవరూ అరెస్ట్ చేయలేదు...

గోవా భామ ఇలియానాకు కోపం వచ్చింది. ‘‘బుద్ధి ఉన్నవాళ్లెవరూ ఇలాంటివి రాయరు.

గోవా భామ ఇలియానాకు కోపం వచ్చింది. ‘‘బుద్ధి ఉన్నవాళ్లెవరూ ఇలాంటివి రాయరు. సరైన ఆధారాలు లేకుండా నాపై నిష్కారణంగా నిందలు వేసే అధికారం మీకెవరు ఇచ్చారు?’’ అంటూ బాలీవుడ్ మీడియాపై అంతెత్తు లేచింది. ఇంతకీ ఇలియానా కోపానికి కారణమేంటి? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఇలియానా పేరుతో ఇటీవల ఓ వార్త బాలీవుడ్ మీడియాలో షికారు చేయడం మొదలుపెట్టింది.
 
 ఆ వార్త అక్కడ నుంచి దక్షిణాదికి కూడా పాకింది. ఇలియానాను ముంబయ్ పోలీసులు అరెస్ట్ చేశారని, డూప్లికేట్ నంబర్‌ప్లేటున్న కారును నడుపుతున్న కారణంగా ఇలియానా అరెస్ట్‌కి చేశారనీ, ఓ బాలీవుడ్ ప్రముఖుడి నుంచి వదిలేయమంటూ ఫోన్‌కాల్ రావడంతో వెంటనే వదిలేశారని ఆ వార్త సారాంశం.
 
  అయితే... ఇందులో నిజం లేదని ఇలియానా మీడియా సాక్షిగానే వాపోయారు. ‘‘పేరున్న వాళ్లను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకునే సంస్కతి మంచిది కాదు. నన్ను అరెస్ట్ చేసింది నిజమే అయితే... ఆ విషయాన్ని పోలీసులే మీడియాకు చెప్పేవారు కదా. మరి ఇప్పటివరకూ ఆ విషయం గురించి పోలీసులు కూడా కిమ్మనలేదు. ఎందుకు? నా అరెస్ట్ నిజం కాదు కాబట్టి. నిజానిజాలు తెలుసుకోకుండా, నా వ్యక్తిగత జీవితానికి మచ్చ తెచ్చేలా రాయడం ఎంతవరకు సమంజసం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు ఇలియానా.

Advertisement
 
Advertisement
Advertisement