అమీ జాక్సన్తో జతకడుతున్న ధనుష్ | dhanush to pair up with amy jackson | Sakshi
Sakshi News home page

అమీ జాక్సన్తో జతకడుతున్న ధనుష్

Dec 3 2014 2:10 PM | Updated on Sep 2 2017 5:34 PM

అమీ జాక్సన్తో జతకడుతున్న ధనుష్

అమీ జాక్సన్తో జతకడుతున్న ధనుష్

తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన తదుపరి సినిమాలో బ్రిటిష్ నటి అమీ జాక్సన్తో జత కడుతున్నాడు.

తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన తదుపరి సినిమాలో బ్రిటిష్ నటి అమీ జాక్సన్తో జత కడుతున్నాడు. ఈ తమిళ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇటీవలే వీఐపీ సినిమాతో తనకు బ్లాక్బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు వేల్రాజ్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా రాబోతోంది. వీఐపీ జట్టు మళ్లీ వస్తోందని, ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని ధనుష్ ట్వీట్ చేశాడు. అమీజాక్సన్ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోందని, వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని కూడా అన్నాడు.

ధనుష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన వీఐపీ సినిమా ఈ సంవత్సరంలోనే కోలీవుడ్లో అతిపెద్ద హిట్గా నిలిచింది. కేవలం రూ. 8 కోట్లతో తీసిన ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్. బాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన షమితాబ్ సినిమాలోకూడా ధనుష్ నటించాడు. ప్రస్తుతం తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం మారిలో నటిస్తున్నాడు. అనేగన్ అనే సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. దాని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement