యువతకు నచ్చేలా... | Dhanush and K.V.Anand's 'Anekudu' audio release on 10th february | Sakshi
Sakshi News home page

యువతకు నచ్చేలా...

Feb 7 2015 11:07 PM | Updated on Sep 2 2017 8:57 PM

యువతకు నచ్చేలా...

యువతకు నచ్చేలా...

‘రఘువర న్ బీటెక్’ చిత్రంతో తెలుగులో మంచి విజయం అందుకున్న తమిళ నటుడు ధనుష్ త్వరలో ‘అనేకుడు’గా

 ‘రఘువర న్ బీటెక్’ చిత్రంతో తెలుగులో మంచి విజయం అందుకున్న తమిళ నటుడు ధనుష్ త్వరలో ‘అనేకుడు’గా రాబోతున్నారు. అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన  ఈ చిత్రానికి  ‘రంగం’ ఫేం కేవీ ఆనంద్ ద ర్శకుడు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కల్పాత్తి ఎస్.అగోరమ్, ఎస్.గణేష్, ఎస్.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ నెల 10న పాటలను విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. ఆనంద్ మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి, హారీస్ జైరాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు ’’ అని చెప్పారు. కార్తీక్, ఐశ్వర్య, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  కెమెరా: ఓం ప్రకాశ్, ఎడిటింగ్: ఆంటోని.
 

Advertisement
 
Advertisement
Advertisement