బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా? | Bigg Boss 3 Telugu Shilpa Chakravarthy May Gives Tough Fight To Srimukhi | Sakshi
Sakshi News home page

శ్రీముఖిని నిలువరించేందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా..?

Sep 3 2019 7:33 PM | Updated on Sep 3 2019 7:34 PM

Bigg Boss 3 Telugu Shilpa Chakravarthy May Gives Tough Fight To Srimukhi - Sakshi

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో శ్రీముఖి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని అందరికీ తెలిసిందే. శ్రీముఖి తన స్ట్రాటజీతో ఆట ఆడే విధానం, అందర్నీ అంచనా వేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే విధానానికి ఫాలోయింగ్‌ పెరుగుతూ ఉంది. అయితే శ్రీముఖికి ఎంత ఫాలోయింగ్‌ పెరుగుతుందో.. అంతే నెగెటివిటీ పెరగుతోంది.

అయితే బిగ్‌బాస్‌ నిర్వాహకులు కూడా శ్రీముఖికే సపోర్ట్‌ చేస్తున్నారని ఆమెను వ్యతిరేకించేవారు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు ఫేవర్‌గానే బిగ్‌బాస్‌ నడుచుకుంటోందనే రూమర్స్‌ వినిపిస్తున్నాయి. శ్రీముఖిని నిలువరించేందుకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీని హౌస్‌లోకి పంపించాలని కొందరు నెటిజన్లు కోరారు. ఒకప్పటి యాంకర్‌, హోస్ట్‌ అయిన శిల్పా చక్రవర్తిని హౌస్‌లోకి పంపడం వెనుక ఇలాంటి కారణమే ఉందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇంట్లోకి వచ్చిన వెంటనే నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా శ్రీముఖి పేరు చెప్పడం కూడా ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మరి మున్ముందు శిల్పా చక్రవర్తి, శ్రీముఖిలు స్నేహితులుగా ఉంటారా? శత్రువులుగా మారుతారా? అన్నది చూడాలి. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి కొంత ప్లస్‌, మరికొంత మైనస్‌ ఉండటం సహజమే. మరి శిల్పా చక్రవర్తి అందరితో కలిసిపోయి చివరివరకు నిలబడుతుందా? అన్నది చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement