ఒక్కడే కానీ మూడు గెటప్స్‌ | Atharvaa's next film titled 'Boomerang' | Sakshi
Sakshi News home page

ఒక్కడే కానీ మూడు గెటప్స్‌

Sep 23 2018 6:12 AM | Updated on Sep 23 2018 6:12 AM

Atharvaa's next film titled 'Boomerang' - Sakshi

‘హృదయం’ ఫేమ్‌ మురళి గుర్తుండే ఉంటారు. మురళి కుమారుడు అథర్వా మురళి హీరోగా తమిళంలో వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నారు. లవర్‌బాయ్‌గా లవ్‌స్టోరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అథర్వ నటిస్తున్న చిత్రాల్లో ‘బూమర్యాంగ్‌’ ఒకటి. ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. ఇందులో అథర్వ మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారట. అందులో ఈ గుండు పాత్ర ఒకటి. ‘‘ఈ పాత్ర కోసం గుండు చేయించుకుంటే వేరే సినిమాలకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. కానీ అథర్వ అదేం ఆలోచించలేదు. వెంటనే గుండు చేయించుకున్నాడు. స్క్రిప్ట్‌కి చాలా ముఖ్యమైన సీన్స్‌ ఇవి’’ అని దర్శకుడు కన్నన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement