సూర్యతో ఆర్య | Arya joins Suriya 37 after Boman Irani and Sayyeshaa | Sakshi
Sakshi News home page

సూర్యతో ఆర్య

Jul 5 2018 12:22 AM | Updated on Jul 5 2018 12:22 AM

Arya joins Suriya 37 after Boman Irani and Sayyeshaa - Sakshi

సూర్య, కేవీ ఆనంద్, ఆర్య

తమిళ హీరో ఆర్య లండన్‌ వెళ్లారు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ తీసిన తన ఫొటోను ఆర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. సూర్య సినిమా కోసం బొమన్‌ ఇరానీ లండన్‌ వెళ్లారట. సో.. సూర్య సినిమాలో ఆర్య ఓ రోల్‌ చేయబోతున్నారనే ఉహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. తన సినిమాలో ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు కేవీ ఆనంద్‌ ప్రకటించారు.

‘‘జామీ (ఆర్య) షూట్‌లో జాయిన్‌ అయ్యాడు’’ అని పేర్కొన్నారు కేవీ ఆనంద్‌. సూర్య హీరోగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. మోహన్‌లాల్, అల్లుశిరీష్, బొమన్‌ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు హారీష్‌ జైరాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement