బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ | Amy Jackson To Romance Prabhas | Sakshi
Sakshi News home page

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

Jun 4 2016 8:18 AM | Updated on Sep 4 2017 1:40 AM

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

బాహుబలితో బ్రిటిష్ బ్యూటీ

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం...

బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్గా మారిన ప్రభాస్, బాహుబలి 2 సెట్స్ మీద ఉండగానే తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పటికే ప్రభాస్ రెగ్యులర్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. అందుకే బాహుబలి పూర్తవ్వగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను పట్టాలెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. చాలాకాలం క్రితమే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సినిమా ఉంటుందంటూ ప్రకటించాడు ప్రభాస్.

యువి క్రియేషన్స్ బ్యానర్.., ప్రభాస్, సుజిత్ల సినిమాను భారీగా నిర్మించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో ప్రభాస్కు  ఫాలోయింగ్ రావటంతో ఈ సినిమాను కూడా మూడు భాషల్లో భారీగా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. తెలుగు, తమిళ్తో పాటు హిందీలో కూడా గుర్తింపు ఉన్న అమీజాక్సన్ను ఈ సినిమాను హీరోయిన్గా ఫైనల్ చేశారట. తొలిగా ఈ బ్రిటిష్ బ్యూటీ ప్రభాస్ పక్కన నటించటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement