స్టార్ డైరెక్టర్‌ను టెన్షన్ పెడుతోన్న హీరోయిన్ | amy jackson Hot photos raised tension for director shankar | Sakshi
Sakshi News home page

స్టార్ డైరెక్టర్‌ను టెన్షన్ పెడుతోన్న హీరోయిన్

Jul 25 2017 6:16 PM | Updated on Sep 5 2017 4:51 PM

స్టార్ డైరెక్టర్‌ను టెన్షన్ పెడుతోన్న హీరోయిన్

స్టార్ డైరెక్టర్‌ను టెన్షన్ పెడుతోన్న హీరోయిన్

సాధారణంగా దర్శకులు హీరోయిన్లను టెన్షన్‌ పెడుతుంటారు. అలాంటిది నటి అమీ జాక్సన్‌ మాత్రం టాప్‌ డైరెక్టర్‌ను కలవర పెడుతోంది.

చెన్నై: సాధారణంగా దర్శకులు హీరోయిన్లను టెన్షన్‌ పెడుతుంటారు. అలాంటిది నటి అమీ జాక్సన్‌ మాత్రం టాప్‌ డైరెక్టర్‌ను కలవర పెడుతోంది.  మదరాసు పట్టణం మూవీతో ఇంగ్లీష్‌ భామ అమీ జాక్సన్‌ కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఆపై ఈ అమ్మడు 'ఐ' చిత్రంతో ఏకంగా స్టార్ డైరెక్టర్ శంకర్‌నే ఆకట్టుకుంది. అందుకే ఆ చిత్రం నిరాశపరచినా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 2.0. వంటి భారీ చిత్రంలో నటించే ఛాన్సిచ్చారు. అది తప్ప ఎమీకిక్కడ అవకాశాలు రాకపోవడంతో ఆమె పలు ఫీట్లు చేస్తోంది. ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటోంది.

ప్రచారానికి అమీ ఎంచుకున్న బ్రహ్మాస్త్రం గ్లామర్‌. ఈమె తన హాట్ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ అవకాశాలను వెతుక్కుంటోంది. తాజాగా ఓ టవల్‌ను ఒంటికి చుట్టుకుని దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా అవి సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇవి చూసిన దర్శకుడు శంకర్‌ టెన్షన్‌ పడుతున్నారని కోలీవుడ్ టాక్. ఇప్పటికే తన 2.0. మూవీ నిర్మాణంలో జాప్యం జరగడం, మరో వైపు రజినీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం కాలా గురించిన ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఒత్తిడిలో ఉన్న శంకర్‌.. అమీ అర్థనగ్న దృశాలు ఆయనను మరింత టెన్షన్‌కు గురి చేస్తున్నాయని తెలుస్తోంది. 2.0 మూవీపై ఆమెకు నమ్మకం లేనందువల్లే ఇలా చేస్తుందా అన్న ఆలోచన శంకర్ మదిలో మెదులుతోందని టాక్ వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement