కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం | Amy Jackson Engagement to Boyfriend George Panayiotou | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరం.. కొత్త ప్రయాణం

Jan 3 2019 3:53 AM | Updated on Jan 3 2019 3:53 AM

Amy Jackson Engagement to Boyfriend George Panayiotou - Sakshi

అమీ జాక్సన్‌, జార్జ్‌ పణాయిట్టో

జీవితంలో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సంవత్సరంలో మొదటిరోజు ఎంచుకున్నారు అమీ జాక్సన్‌. తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ పణాయిట్టోతో జనవరి ఫస్ట్‌ రోజున ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారీ బ్రిటీష్‌ బ్యూటీ. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారు. జార్జ్, అమీ 2015 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ... అలాంటిదేం లేదని చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు అమీ జాక్సన్‌.  గతేడాది వేలంటేన్స్‌ డే రోజు జార్జ్‌ను ప్రేమిస్తున్నట్టు  అధికారికంగా ప్రకటించారు.

అప్పటినుంచి హాలిడే ట్రిప్స్‌లోనూ, పార్టీల్లోనూ తరచుగా కలుస్తూ, ఆ ఫొటోలు పోస్ట్‌ చేస్తున్నారు. రీసెంట్‌గా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కోసం గ్రాండ్‌ క్రిస్మస్‌ పార్టీని కూడా అరేంజ్‌ చేశారు. న్యూ ఇయర్‌ హాలీడే సందర్భంగా జాంబియా వెళ్లింది ఈ జంట. అక్కడే ఈ ఇద్దరూ రింగ్స్‌ మార్చుకున్నారు.  ‘‘మా జీవితాల్లో సరికొత్త సాహస యాత్రను మొదలుపెట్టాం. ఐ లవ్‌ యూ జార్జ్‌. నన్నీ ప్రపంచంలోనే ఆనందమైన అమ్మాయిని చేసినందుకు థ్యాంక్స్‌’’ అని ఈ ఫొటోను పోస్ట్‌ చేశారు. త్వరలోనే గ్రాండ్‌ వెడ్డింగ్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నారట అమీ, జార్జ్‌.

Advertisement
 
Advertisement
Advertisement