ఆన్‌ పబ్లిక్‌ డిమాండ్‌...

Actress Forcing Prabhas to Come Out & Join - Sakshi

ఎవెలిన్‌ శర్మ... ఈ జర్మన్‌ బ్యూటీ గురించి తెలుగు ఆడియన్స్‌కు అంతగా తెలియదు. కానీ ‘సాహో’ సినిమాలో నటిస్తుండటంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌కు ఇప్పుడిప్పుడే కాస్త దగ్గరవుతున్నారు. కొందరు నెటిజన్లు ప్రభాస్‌తో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టమని ఆమెని అడిగారట. ‘‘హాయ్‌... పబ్లిక్‌ డిమాండ్‌. మై హీరో ప్రభాస్‌తో ఫొటో దిగాను. ఆయన్ని ట్విట్టర్‌ ఖాతా ఓపెన్‌ చేయమని రిక్వెస్ట్‌ చేశాను.

ప్రభాస్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను స్టార్ట్‌ చేయాలనుకున్నవాళ్లు ఈ పోస్ట్‌ను రీ ట్వీట్‌ చేయండి’’ అని సరదాగా అంటూ ప్రభాస్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేశారు ఎవెలిన్‌. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శక త్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఎవెలిన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.
∙ఎవెలిన్‌ శర్మ, ప్రభాస్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top