అందరినీ ఆకట్టుకునేలా ‘బూమరాంగ్‌’ | Actor Atharvaa Boomerang Movie Press Meet | Sakshi
Sakshi News home page

అందరినీ ఆకట్టుకునేలా ‘బూమరాంగ్‌’

Mar 3 2019 10:32 AM | Updated on Mar 3 2019 10:32 AM

Actor Atharvaa Boomerang Movie Press Meet - Sakshi

బూమరాంగ్‌ చిత్రం జనరంజకంగా ఉంటుందని ఈ చిత్ర కథానాయకుడు అధర్వ పేర్కొన్నారు. ఈయనకు జంటగా ఇందుజా, మేఘాఆకాశ్‌ నటించారు. దర్శకుడు ఆర్‌.కన్నన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. రథన్‌ సంగీతాన్ని, సెల్వ ఛా యాగ్రహణం అందించిన ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఆర్‌.కన్నన్‌ మాట్లాడుతూ.. ఒక చిత్రం అనుకున్న విధంగా రూపొందించాలంటే హీరో సహకారం అవసరం అన్నారు. అలా ఈ చిత్రానికి నటుడు అధర్వ బలంగా నిలిచారని అన్నారు. అందుకే తాను అధర్వతో మరో చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బూమరాంగ్‌ చిత్రానికి సహకారాన్ని అందించిన పంకజ్‌ మెహతా, అన్భుచెలియన్, రాంప్రసాద్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బూమరాంగ్‌ చిత్రాన్ని మంచి తేదీలో విడుదల చేయడానికి సహకరించిన ట్రైడెంట్స్‌ ఆర్ట్స్‌ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని దర్శక నిర్మాత ఆర్‌.కన్నన్‌ అన్నారు.

చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభించామో, ఎప్పుడు పూర్తి చేశామో తెలియలేదన్నారు. అంతవేగంగా బూమరాంగ్‌ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. బూమరాంగ్‌ అంటే కర్మ అని అర్థం అని, మనం ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం ప్రచార బృందం అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ చిత్రాన్ని తాము అంతా కలిసి జనరంజకంగా రావడానికి శ్రమించి పని చేశామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన మేఘాఆకాశ్, ఇందుజా ఇద్దరూ తమిళ భాష తెలిసిన నటీమణులనీ, వారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందనీ అధర్వ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement