అనుకోకుండా అలా కుదిరింది! | '2.0' will be released on January 25th | Sakshi
Sakshi News home page

అనుకోకుండా అలా కుదిరింది!

Oct 23 2017 11:43 PM | Updated on Sep 12 2019 10:40 AM

'2.0' will be released on January 25th - Sakshi

అభిమాన హీరో జస్ట్‌ నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సార్లు స్క్రీన్‌ మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కి ఫెస్టివలే. సంక్రాంతి, ఉగాది, దీపావళి.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చినట్లు అనిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరి టు ఏప్రిల్‌ రజనీకాంత్‌ అభిమానులు ఆల్‌ ఫెస్టివల్స్‌ చేసుకునే చాన్స్‌ ఉంది. ఎందుకంటే సూపర్‌ స్టార్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో రజనీ ‘కాలా’ విడుదల అవుతుందట.

ఈ మధ్య ఏడాదికో సినిమా లేక రెండేళ్లకో సినిమాలో కనిపిస్తున్నారు రజనీ. ఇప్పుడిలా నాలుగు నెలల్లో రెండు సినిమాల్లో కనిపించడం అనేది ఫ్యాన్స్‌కి తీపి వార్తే కదా. ‘2.0’ గ్రాఫిక్స్‌కి ఎక్కువ టైమ్‌ పట్టడం, ఈలోపు రజనీ ‘కాలా’చేయడంతో ఇలా కుదిరింది. ‘2.0’ షూటింగ్‌ ఇటీవల చిత్రీకరించిన పాటతో పూర్తయిన విషయం తెలిసిందే. ‘కాలా’ ఆన్‌ సెట్స్‌లో ఉంది. ఇటీవలే నైట్‌ సీన్స్‌ తీశారు. రజనీ అల్లుడు, హీరో ధనుష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కబాలి’ ఫేమ్‌ పా. రంజిత్‌ దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement