12 రోజులు.. 5 కోట్లు | '2.0' cost about 5 crores per a song | Sakshi
Sakshi News home page

12 రోజులు.. 5 కోట్లు

Jul 18 2017 11:08 PM | Updated on Sep 5 2017 4:19 PM

12 రోజులు.. 5 కోట్లు

12 రోజులు.. 5 కోట్లు

జులు.. 5 కోట్లుతలైవా అంటే తమాషానా? ఒకే ఒక్క పాట కోసం 5 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే తలైవా (నాయకుడని అర్థం. అభిమానులు అలానే పిలచుకుంటారు) రజనీకాంత్‌ రేంజ్‌ అది అని ఆయన అభిమానులు కాలరెగరేస్తున్నారు.

12 రోజులు.. 5 కోట్లుతలైవా అంటే తమాషానా? ఒకే ఒక్క పాట కోసం 5 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే తలైవా (నాయకుడని అర్థం. అభిమానులు అలానే పిలచుకుంటారు) రజనీకాంత్‌ రేంజ్‌ అది అని ఆయన అభిమానులు కాలరెగరేస్తున్నారు. రజనీ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘రోబో’కి సీక్వెల్‌గా లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఒక్క సాంగ్‌ మినహా ఈ సినిమా కంప్లీట్‌ అయింది. ఈ ఒక్క సాంగ్‌ను దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టి వేసిన సెట్‌లో 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. రజనీకాంత్, అమీ జాక్సన్‌లపై ఈ రొమాంటిక్‌ సాంగ్‌ తీయనున్నారు. దీనికోసం చెన్నైలో గ్రాండ్‌గా ఓ సెట్‌ వేశారు. ‘‘మంచి డాన్స్‌కి స్కోప్‌ ఉన్న సాంగ్‌ ఇది. బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌. ఆ సాంగ్‌ పర్‌ఫెక్ట్‌గా రావాలంటే నేను కనీసం పది రోజులైనా రిహార్సల్‌ చేయాలి’’ అని అమీ జాక్సన్‌ పేర్కొన్నారు. ఈ ఐదు కోట్ల పాట అదిరిపోయేలా ఉంటుందని చెన్నై టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement