'ఫేస్బుక్ ఫ్రెండ్స్ను ఈజీగా తెలుసుకోవచ్చు' | place find this facebook application | Sakshi
Sakshi News home page

'ఫేస్బుక్ ఫ్రెండ్స్ను ఈజీగా తెలుసుకోవచ్చు'

May 30 2015 10:14 AM | Updated on Jul 26 2018 5:23 PM

'ఫేస్బుక్ ఫ్రెండ్స్ను ఈజీగా తెలుసుకోవచ్చు' - Sakshi

'ఫేస్బుక్ ఫ్రెండ్స్ను ఈజీగా తెలుసుకోవచ్చు'

ఏదైనా అవసరం కోసం మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే ఒక చోట ఉండి, మరో ప్రదేశం పేరు చెప్పే అలవాటుందా.

వాషింగ్టన్: ఏదైనా అవసరం కోసం మీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగితే ఒక చోట ఉండి, మరో ప్రదేశం పేరు చెప్పే అలవాటుందా.. ఇప్పటివరకు అలా చేసినా పర్వాలేదు కానీ ఇకపై మాత్రం అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీ ఫ్రెండ్ తన ఫేస్‌బుక్ ద్వారా మీరెక్కడున్నాడో కచ్చితంగా కనిపెట్టేస్తాడు. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రూపొందించిన కొత్త తరహా గూగుల్ క్రోమ్ వినియోగించి ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా స్నేహితుడు ఉన్న ప్రదేశాన్ని మ్యాప్‌తో కనిపెట్టొచ్చు. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌కు చెందిన అరణ్ ఖన్నా అనే పరిశోధకుడు దీన్ని రూపొందించాడు.

మరాడెర్స్ మ్యాప్ అనే పేరుతో ఉన్న ఈ ఫీచర్ ద్వారా దేశంలో మన స్నేహితులు ఎక్కడున్నా కచ్చితమైన స్థానాన్ని కనుక్కోవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్ రూపంలో మెసేజ్ రూపంలో పొందొచ్చు. లొకేషన్ షేరింగ్‌ను మీ మొబైల్‌లో ఎనేబుల్ చేసుకుంటేనే ఇతరులు మీరెక్కడున్నారో చూడొచ్చు. మీరు ఎక్కడున్నారో ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేకుంటే దీన్ని డిసేబుల్ చేసుకుంటే చాలు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్‌లపై ఇది పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement