హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో | Kid Goes Around Supermarket Greeting Strangers in Viral Video | Sakshi
Sakshi News home page

హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో

Mar 5 2016 9:27 AM | Updated on Sep 3 2017 7:04 PM

హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో

హల్చల్ చేస్తున్న చిన్నారి వీడియో

సాధారణంగా చిన్నపిల్లలు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్తవాళ్లను చూసినప్పుడు వెంటనే ముడుచుకుపోతుంటారు.

సాధారణంగా చిన్నపిల్లలు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్తవాళ్లని చూసినప్పుడు వెంటనే ముడుచుకుపోతుంటారు. తల్లి ఒడిలోంచి దిగమంటూ మారాం చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఓ 16 నెలల చిన్నారి షాపింగ్ మాల్లో కనిపించిన ప్రతివారిని పలుకరించుకుంటూ వెళ్తున్నఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'లవ్ వాట్ మ్యాటర్స్' పేరుతో ఫేస్బుక్ పేజీలో మూడు వారాల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 46 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.

ఈ వీడియోలో బుడిబుడి అడుగులతో షాపింగ్ మాల్ మొత్తం కలియతిరుగుతున్నజాయ్ అనే చిన్నారి కనిపించిన ప్రతివారిని పలుకరిస్తూ వెళ్లింది. షాపింగ్ చేస్తున్న వారిని, షాప్లో పనిచేస్తున్న వారిని ఇలా తనకు ఎదురు పడిన ప్రతివారిని పలుకరించింది. చివరికి అక్కడ షాపింగ్ చేస్తున్న ఓ మహిళ వద్దకు వెళ్లి ఏ మాత్రం బెరుకు లేకుండా హగ్ కూడా చేసుకోవడం విశేషం.
 

 

Advertisement
 
Advertisement
Advertisement