ఇదేమి టీమ్ స్పిరిట్ బాబోయ్!

ఇదేమి టీమ్ స్పిరిట్ బాబోయ్!


బీజింగ్: చైనాలోని ఓ కంపెనీ బాస్ తన మహిళా ఉద్యోగినుల మధ్య టీమ్ స్పిరిట్‌ను పెంచేందుకు ఓ ఆకతాయి పనికి ఒడి గట్టాడు. నోటిలో పెన్నును ముక్కుకు ఆనిచ్చి పట్టుకొని పెదవుల ద్వారానే ఆ పెన్నును స్వీకరించాల్సిందిగా మహిళా ఉద్యోగులను కోరారు. అలా వారు తీసుకున్న పెన్నును మళ్లీ తన పెదవుల ద్వారా వెనక్కి తీసుకున్నారు. పెన్నును కింద జారవేయకుండానే ఈ తతంగాన్ని కొనసాగాలంటూ ఉద్యోగినులను పురమాయించాడు కూడా. వారిలో ఓ మహిళ ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునో పెన్నును నేలకు జార విడిచింది. అప్పుడు బాస్ పెదాలు, మహిళా ఉద్యోగి పెదాలకు తగిలినట్లు తెలుస్తోంది.



ఇదో సరదా ఆటని, ఉద్యోగుల్లో ఈ ఆట టీమ్ స్పిరిట్‌ను పెంచుతుందని బాస్ వారిని ప్రోత్సహించారు. ఎవరో ఈ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దాన్ని చైనా వీడియో షేరింగ్ సైట్ అయిన ‘మియోపి’లో పోస్ట్ చేయగా, అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ వీడియో ‘యూట్యూబ్’లో దర్శనమిస్తూ మరింత సంచలనం రేపుతోంది.

ఈ వీడియో సన్నివేశంపైనా ఎక్కువ మంది నెటిజెన్లు మండిపడగా, కొందరు మాత్రం తమదైన శైలిలో సున్నితంగా స్పందించారు. 40 సెకండ్ల ఈ వీడియో క్లిప్ మరీ మురిగ్గా ఉందని ఎక్కువ మంది కామెంట్ చేశారు. సాధారణ కంపెనీ అయితే ఈ గేమ్ మాత్రం ఆడదంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘దీన్ని బాస్ భార్య, మహిళా ఉద్యోగినుల భర్తలు చూశారా?’ అంటూ ఇంకొకరు, ‘ఇదే తరహాలో మనం ముద్దుల గేమ్ ఆడొద్దు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంతకు ఆ కంపెనీ ఏమిటో, దాని బాస్ ఎవరో తెలియలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top