ప్రాణం పోసిన ‘త్రీడీ’ గుండె!
త్రీడీ ప్రింటర్‌పై రూపొందించిన ఒక కృత్రిమ గుండె చిన్నారి ప్రాణాలను నిలిపింది.
వాషింగ్టన్: త్రీడీ ప్రింటర్‌పై రూపొందించిన ఒక కృత్రిమ గుండె చిన్నారి ప్రాణాలను నిలిపింది. అమెరికాలోని కెంటకీకి చెందిన రోలాండ్ లియాన్ గుండెలో నాలుగు తీవ్ర లోపాలతో జన్మించాడు. ఆ చిన్నారి గుండెను పోలిన.. త్రీడీ గుండె సహాయంతో లూస్‌విల్లేవర్సిటీ, కోసేర్ పిల్లల ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. తొలుత ఆ చిన్నారి గుండెను అన్ని కోణాలో సీటీ స్కాన్‌ద్వారా చిత్రించారు. వాటి సహాయంతో ఆ చిన్నారి గుండెను త్రీడీ ప్రింటర్‌పై 50 శాతం పెద్దదిగా ప్రింట్ చేశారు. దాని సహాయంతో శస్త్రచికిత్సకు నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి, ఒకే చిన్న శస్త్రచికిత్సతో అన్ని లోపాలను సరిచేశారు. చిన్న గాటుతోనే శస్త్రచికిత్సను చేయడంతో... కేవలం నాలుగు రోజుల్లోనే చిన్నారి కోలుకోవడం గమనార్హం.


