ఆర్మీ రిక్రూట్ మెంట్లో పేల్చుకున్న ఉగ్రవాది | 12 killed in suicide bomb attack on Afghan army recruits | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్ మెంట్లో పేల్చుకున్న ఉగ్రవాది

Apr 11 2016 7:52 PM | Updated on Sep 3 2017 9:42 PM

ఆర్మీ రిక్రూట్ మెంట్లో పేల్చుకున్న ఉగ్రవాది

ఆర్మీ రిక్రూట్ మెంట్లో పేల్చుకున్న ఉగ్రవాది

అఫ్ఘానిస్తాన్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడి 12మంది భావి సైనికులను పొట్టన బెట్టుకున్నారు.

జలాలబాద్: అఫ్ఘానిస్తాన్లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడి 12మంది భావి సైనికులను పొట్టన బెట్టుకున్నారు. ఈ దాడిలో మరో 30మంది కూడా గాయాలపాలయ్యారు. 'ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 12మంది ఆర్మీ రిక్రూట్కు వచ్చినవారు చనిపోయారు.

మరో 38 మంది తీవ్ర గాయాలపాలయ్యారు' అని నంగర్ హార్ ప్రావిన్స్కు చెందిన ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ ఆత్మాహుతి దాడి ఎవరు చేశారనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement